తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రొవిడెంట్ కెన్‌వర్త్, ప్రేమావతిపేట్ గ్రామానికి చెందిన చిట్టి మోహన్ (55) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన ఆయన ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

చిట్టి మోహన్ ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా కనిపించినట్లయితే వెంటనే సమీపంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని, లేదా కుటుంబ సభ్యులను సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆయనకు సంబంధించిన ఏ చిన్న సమాచారం ఉన్నా వెంటనే తెలియజేసి కుటుంబానికి సహకరించాలని ప్రజలను కోరారు