తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ సర్కిల్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా 6వ తేదీ గురువారం ఉదయం నిర్వహించిన జయశంకర్ సార్ జయంతి వేడుకలలో పీఏసీ చైర్మెన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, స్థానిక ముఖ్య నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలరాం యాదవ్ పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు.