తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అమెరికాలో నిర్వహించిన తెలుగు మహాసభల్లో పాల్గొని స్వదేశానికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావుకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్‌గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని పూలమాలలు వేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో నారగూడెం మల్లారెడ్డి, పొన్నమోని మల్లేష్ యాదవ్, సాబాధ విజయ్ కుమార్, చేడం వెంకటరమణ గుప్తా, కొత్త సోల్కర్ రెడ్డి, శేఖర్, రామారావు, సాయి స్నేహిత్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమెరికా పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన సందర్భంగా నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
