తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, ఎల్‌ఓసీ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో పంపిణీ చేశారు. వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు ఈ పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక సహాయం సకాలంలో అందేలా నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో హౌసింగ్‌కు సంబంధించిన అంశాలపై హౌసింగ్ శాఖ అధికారులు, ఏఈలు, ఎంపీడీవోలతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల ద్వారా ప్రయోజనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంజూరైన ఇళ్లు, నిర్మాణ దశలు, పెండింగ్‌లో ఉన్న అంశాలు తదితర వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి నివేదిక అందించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఈలు హరి, సురేష్, ఎంపీడీవోలు సీత, గీత, సుజాత, సులోచన, జయరాం, విజయలక్ష్మి, శంకర్, మున్సిపల్ కమిషనర్లు మహమూద్, రాఘవేందర్‌రెడ్డి, హౌసింగ్ ఏఈలు హరి, సురేష్, కేదార్‌నాథ్, పల్లవి, శాలిని, చక్రి, పృథ్వీరాజ్, క్రాంతి, మున్సిపాలిటీల ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
