తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైన చిగురింత పారిజాత నర్సింహారెడ్డి హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆమెను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పారిజాత నర్సింహారెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
