తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ కూకట్ పల్లి వివేకానందనగర్ కాలనీలోని తన నివాసంలో 9వ జాతీయ పోషణ మాసం మా అంగన్వాడీ మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు ప్రెషర్ కుక్కర్లను పంపిణీచేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో సీనియర్ నాయకులతో కలిసి అంగన్వాడీ టీచర్లకు ప్రెషర్ కుక్కర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ, అంగన్వాడీ టీచర్లు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న సేవలు అభినందనీయమని, వారి కృషిని గుర్తించి చిన్నపాటి సహాయంగా ఈ ప్రెషర్ కుక్కర్లు అందజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ అంగన్వాడీల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ, అంగన్వాడీ టీచర్లు సమాజంలో చేస్తున్న సేవ ఎంతో గొప్పదని, వారిని ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
