తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హనుమాన్‌నగర్‌లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో ఎన్‌సీడీ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. శిబిరంలో 80 మందికి పైగా ప్రజలకు రక్తపోటు, రక్తంలో చక్కెర పరీక్షలు నిర్వహించారు. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి అసంక్రమణీయ వ్యాధులను ముందస్తుగా గుర్తించేందుకు 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డా. గద్దె చేతన్ సూచించారు. అధిక బరువు, పొగాకు, మద్యం వినియోగం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్నవారు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ముందస్తు గుర్తింపుతో సకాలంలో చికిత్స తీసుకోవడంతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఆలస్యం చేయకుండా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను సందర్శించి ఎన్‌సీడీ స్క్రీనింగ్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం అండాలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.