తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ పరిధిలోని మీసేవ, న్యూ కాలనీ, చిరంజీవి నగర్ ప్రాంతాల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తులు, స్థానికుల కోసం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. మియాపూర్ మీసేవలో వడ్డెర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో యలమంచి ఉదయ్ కిరణ్ యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం, నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించారు. న్యూ కాలనీలో గజవాకర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, చిరంజీవి నగర్లో టీమ్ మహాబల యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు యలమంచి ఉదయ్ కిరణ్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో గిరి, రవి, లక్ష్మణ్, సురేష్, న్యూ కాలనీలో ఈశ్వర్, బాబు, చిరంజీవి నగర్లో మహేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆయా ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువత, స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలు భక్తి, సేవా భావంతో సాగాయి. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సంతోషం, ఐశ్వర్యం, శ్రేయస్సు కలగాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.
