తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ వారి సీఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన 2అదనపు తరగతి గదుల భవనాన్ని ఎమ్ఈఓ రవీందర్ రాజు , తాాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు , ఫౌండేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు , విద్యార్థులతో కలిసి పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ వారి సీఎస్ఆర్ నిధులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించిన 2అదనపు తరగతి గదులను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ఈ రోజు పాఠశాలకు పండుగ రోజు అని , విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వారి బంగారు భవిష్యత్తుకు పునాది లాంటిదని ప్రాథమిక విద్య అని మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియచేశారు. అన్ని హంగులతో సకల సౌకర్యాలతో కొత్త సొగసులతో భవనాన్ని నిర్మించడం జరిగినదని, పిల్లలకు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే విధంగా నిర్మించడం జరిగినదని సీఎస్ఆర్ ప్రతినిధులు దేవుడితో సమానమని, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని, సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ సేవ చేయాలని, పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సమాజంకు మంచిపేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని, విద్యార్థులు ఒక మంచి లక్ష్యం ఏర్పరచుకొని, మంచి క్రమ శిక్షణ, ఏకాగ్రతతో, సడలని పట్టుదలతో ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగానికి ఎంతగానో కృషి చేస్తున్నారని, మియాపూర్ 10ఎకరాలలో 200కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియన్ పాఠశాలకు ఇటీవలే శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని, త్వరలోనే పనులు ప్రారంభించుకోవడం జరుగుతుందని, కొండాపూర్, చందానగర్ లో కోర్ అర్బన్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్ని ప్రభుత్వ పాఠశాలలను అన్ని హంగులతో ,సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని, ప్రవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని తెలియచేశారు, తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.