తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆర్మూర్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో “జాతీయ చేనేత దినోత్సవము” వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది చేనేత కార్మికులను ఇటీవల ఎన్నికైన నూతన చైర్మన్ చెన్న రవికుమార్,వైస్ చైర్మన్ బెన్కి గంగా మోహన్,కోశాధికారి చిట్ల శ్యామ్ సుందర్ డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ చేనేత మగ్గం అంటే ఎలాంటి విద్యుత్ ను ఉపయోగించకుండా వస్త్రాలను నేయడానికి ఉపయోగించే మగ్గం, చేనేత వస్త్రాలను సాధారణంగా నేత కార్మికులు ఇళ్లలో చట్రపు మగ్గాలపై నేస్తారు, నూలు పోగులను అల్లుతూ జీవితాలను అందంగా తీర్చిదిద్దే,ప్రతీ చేనేత కార్మికుడి చేతుల్లో శ్రమ ఉంది. కళ ఉంది,దేశ గౌరవం ఉంది. ప్రతి చేనేత కార్మికుడు రాష్ట్ర ప్రభుత్వం అందించే పావలా వడ్డీ, చేనేత మిత్ర, నేతన్న చేయూత వంటి పథకాలు పొందాలని అన్నారు. చైర్మన్ రవి కుమార్ మాట్లాడుతూ నాకున్న అనుభవం తో, పరిచయాలతో చేనేత సంఘానికి పూర్వ వైభవం తెస్తానని,ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలని కొనుగోలు చేసి చేనేత కుటుంబాలకు అండగా నిలవాలని, చేనేతను ప్రేమిద్దాం… చేనేతను ప్రోత్సాహిద్దాం అని అన్నారు. పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ చేనేత కార్మికులకు,నూతనంగా ఎన్నుకోబడిన డైరెక్టర్లకు మార్కండేయ కండువాలు ధరింపజేసి, నూలుపోగుల దండను ఒక మాలగా పేర్చి వారి మెడలో వేసి,శాలువలతో సన్మానించారు.ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా జింధం నరహరి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కట్కం నరేందర్,సహాయ కార్యదర్శి జింధం నరహరి,తర్ప అధ్యక్షులు ఒకటవ తర్ప కృష్ణహరి,ఐదవ తర్ప ఆడెపు ప్రభాకర్,ఏడవ తర్ప సదుమస్తుల గణపతి,చేనేత కార్మికులు, డైరెక్టర్లు,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
