తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యూఎస్‌పీసీ (ఉపాధ్యాయ పోరాట కమిటీ) ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మండల యూటీఎఫ్ అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. కొత్త పీఆర్సీని వెంటనే ప్రకటించడంతో పాటు హెల్త్ కార్డులను జారీ చేయాలని, అవి అమల్లోకి వచ్చే వరకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానాన్ని కొనసా గించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యా యులకు టెట్‌లో పాస్ మార్కులను తగ్గించాలని, సబ్జెక్టుల వారీగా టెట్ నిర్వహించాలని, ఇన్‌సర్వీస్ టీచర్లకు వెయిటేజ్ మార్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. యూఎస్‌ పీసీ చేపట్టిన దశలవారీ పోరాటం ఉపాధ్యాయుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ నెల 29న నిర్వహించనున్న “చలో ఇందిరాపార్క్” కార్యక్రమానికి ప్రతి ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులతో కలిసి భారీ సంఖ్యలో హాజరై ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం హామీలను అమలు చేసే వరకు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ అధ్యక్షుడు యాదగిరి, మండల విద్యాధికారి శంకర్ రాథోడ్, పాఠశాల ప్రధానో పాధ్యాయుడు జై శ్రీనివాసరావు, యూటీఎఫ్ జిల్లా బాధ్యుడు సీతయ్య, మండల కార్యదర్శి నందన ఉమామతి శిరీష, పాఠశాల ఉపాధ్యాయ బృందం, అలాగే రంగారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలల ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.