తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం ఆగస్టు 10తో చివరి దశకు చేరుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షుడు పసుపుల సందీప్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఉప్పర్‌పల్లిలో బీఎల్‌వోలను కలిసి వారి సేవలను అభినందించారు. గత 35 రోజులుగా ఉప్పర్‌పల్లి పీఆర్ ప్యాలెస్ సమీపంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ సహాయ కేంద్రం ద్వారా ఓటర్లకు విస్తృత సేవలు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తు ఫారాలను నింపించడంతో పాటు, ఆహ్వాన పత్రాలపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. అలాగే ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి, అవసరమైన సమాచారాన్ని అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సూపర్‌వైజర్ యాదయ్య, రవీందర్ రెడ్డి, విజయ్ యాదవ్, షేక్ బాషా, జయప్రకాష్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, బీఎల్‌వోలు అనిల్, ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.