తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బోనాల పండుగ సందర్భంగా నర్కుడ గ్రామ ప్రజలకు మరో అభివృద్ధి కానుక అందింది. గ్రామంలోని గాడు బావి కల్వర్ట్ నుంచి హనుమాన్ ఆలయం వరకు నిర్మించిన ఆర్ అండ్ బి బీటీ రహదారి పనులు పూర్తయ్యాయి. రహదారి అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ రహదారి నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకుని, గ్రామ ప్రజల సమస్యను స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యేలా కృషి చేసిన గ్రామ సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్‌ను గ్రామస్థులు అభినందించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్ మాట్లాడుతూ, బోనాల పండుగ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు, గ్రామ ప్రజల సహకారంతో ఈ బీటీ రహదారి ప్రజలకు అందుబాటులోకి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామాభివృద్ధే లక్ష్యంగా మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నీరటి రాజు ముదిరాజ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్‌కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందనలు తెలియజేశారు.