తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :వనస్థలిపురంలో నిర్వహించిన చేనేత పారిశ్రామిక సహకార సంఘాల అభినందన సభలో జోగులాంబ గద్వాల్ జిల్లా బూడిదపాడు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు కొంకతి ఆంజనేయులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఆయనను సత్కరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన చేనేత సహకార సంఘాల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ సహకార సంఘాల ద్వారా ఎన్నికైన పాలకవర్గ సభ్యులను రాష్ట్ర పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో అభినందించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు.
సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ చేనేత రంగ అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. నేతన్నల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన సహకార సంఘాల పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సేవలు చేనేత రంగ పురోగతికి, నేతన్నల సంక్షేమానికి మరింతగా దోహదపడాలని వక్తలు అభిలషించారు.
