తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బోనాల పండుగను పురస్కరించుకుని బాబుల్ రెడ్డి నగర్‌లో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు మాజీ వార్డు సభ్యుడు సోమ శ్రీనివాస్ గుప్తా, మాజీ కౌన్సిలర్ ఎస్. వెంకటేష్ తెలిపారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని మైలార్ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్‌ను వారు కోరారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులు కలిసి విజ్ఞప్తి చేశారు.
