తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : అత్తాపూర్ సర్కిల్ కాటేదాన్, మైలర్ దేవ్‌పల్లి డివిజన్ ప్రజలకు టీడీపీ డివిజన్ నాయకుడు ఉష్కమూరి విజయ్ కుమార్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, ఆనందం, సుఖసంపదలు వెల్లివిరియాలని కోరుకున్నారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఉష్కమూరి విజయ్ కుమార్ కోరారు.
