తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం కుటుంబ వివరాలను ధ్రువీకరించే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ సేవను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కుటుం బానికి సంబంధించిన రిజిస్టర్ ప్రతిని పొందేందుకు అర్హులైన పౌరులు సమీప మీసేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీసేవా ఆన్‌లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ సేవను పొందే అవకాశం ఉంది. కుటుంబ రిజిస్టర్‌లో వివరాలు నమోదై ఉన్న కుటుంబంలోని మేజర్ సభ్యుడు మాత్రమే ఆ కుటుంబ రిజిస్టర్ ప్రతిని పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హుడిగా ప్రభుత్వం పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత నిర్ణీత ప్రభుత్వ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు స్వీకరించిన తేదీ నుంచి సాధారణంగా రెండు పని దినాల్లో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌ను జారీ చేసే విధంగా సేవను రూపొందించారు. కుటుంబ సభ్యుల వివరాల ధ్రువీకరణ, వివిధ ప్రభుత్వ అవసరాలు, ఆస్తి లేదా వారసత్వ సంబంధిత వ్యవహారాల్లో ఈ ధ్రువపత్రం ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ రెండూ ఒకటే కావని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరణించిన వ్యక్తికి సంబంధించిన వారసుల హక్కుల కోసం అవసరమైన సందర్భాల్లో ప్రత్యేకంగా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అవసరం కావచ్చు. ప్రజలు తమ కుటుంబ వివరాలు రిజిస్టర్‌లో సరిగ్గా నమోదై ఉన్నాయో లేదో పరిశీలించుకుని, అవసరమైనప్పుడు మీసేవా కేంద్రం ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

You missed