తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలకు నవ యువ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాం క్షించారు.ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను జరుపుకోవాలని, పండుగ సందర్భంగా సోదరభావం, ఐక్యతను చాటుతూ శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకోవాలని కోరారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ మంచి జరగాలని, ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.