తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  బోనాల పండుగ సందర్భంగా బాబుల్ రెడ్డి నగర్ శ్రీ పోచమ్మ దేవాలయాన్ని తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఏర్వ సత్యనారాయణ దర్శించు కున్నారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్వ సత్యనారాయణను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.