తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆషాఢమాసం సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్, గుమ్మడి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ల పరిధిలోని పలు ప్రముఖ ఆలయాలను సందర్శించి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో నిర్వహించిన ఫలహారం బండి కార్యక్రమాలు, తొట్టెల ఊరేగింపుల్లో పాల్గొని భక్తులతో కలిసి ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. బోనాలు, తొట్టెల ఊరేగింపుల్లో పాల్గొన్న భక్తులు, మహిళలు, యువతకు కార్తీక్ రెడ్డి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మట్టి వాసన, భక్తి శ్రద్ధలను ప్రతిబింబించే పండుగ బోనాలని పేర్కొన్నారు. జగన్మాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సకల ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మహాంకాళి అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సంప్రదాయా లను, ఐక్యతను కాపాడుకుంటూ బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించిన నిర్వాహకులు, భక్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాము యాదవ్, సరిత, సుగుణమ్మ, ధర్మారెడ్డి, రాఘవేంద్ర యాదవ్, రాజేష్ యాదవ్, తిరుపతి రెడ్డి, మైసిరెడ్డి, ఈర్లపల్లి ప్రవీణ్, జగదీష్, వెంకటరమణ, మధగౌడ్, శశి, అనిల్ రాజు, ఈశ్వర్, రాజేష్, క్రాంతి యాదవ్, సరికొండ దుర్గేష్, రవీందర్ యాదవ్, మధు గౌడ్, సంతోష్ గౌడ్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
