తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : తెలంగాణ హైకోర్టు ఆధ్వర్యంలో న్యాయశాఖ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీసుల్లోని ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్), ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఓఎంఆర్‌ ఆధారిత పరీక్షల తేదీలను ప్రకటించారు. ఈ మేరకు జనవరి 19, 2026న జారీ చేసిన నోటిఫికేషన్ నంబర్లు 08/2026, 09/2026 ప్రకారం పరీక్షలను ఆగస్టు 29న నిర్వహించనున్నారు. ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) పోస్టుకు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, ప్రాసెస్ సర్వర్ పోస్టుకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఆగస్టు 22 నుంచి హాల్‌టికెట్లు అభ్యర్థులు ఆగస్టు 22, 2026 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రం వివరాలు హాల్‌టికెట్‌లో ఉంటాయని హైకోర్టు అధికారులు తెలిపారు. హాల్‌టికెట్లను తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.