తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ప్రత్యేక నియామక ప్రకటన విడుదలైంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన బ్యాక్‌లాగ్ ఖాళీల్లో మొత్తం 1,538 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన భారతీయ పౌరులు ఆగస్టు 7 నుంచి 27, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎంచుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషపై చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో పట్టు ఉండాలి. ప్రధాన పరీక్షలో అర్హత సాధించిన తర్వాత స్థానిక భాషా పరీక్ష నిర్వహిస్తారు. 10వ లేదా 12వ తరగతిలో సంబంధిత స్థానిక భాషను చదివినట్లు ధ్రువపత్రం ఉంటే భాషా పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. మొత్తం పోస్టులు: 1,538 దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 7, 2026 దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 27, 2026 పోస్టు: జూనియర్ అసోసియేట్ (క్లర్క్) ఖాళీలు: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బ్యాక్‌లాగ్
