తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన చుడాలి పండుగ ఉత్సవాలకు హాజరయ్యారు. అనంతరం తన నివాసంలో వివిధ మండలాల ముఖ్య నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
తదుపరి మాడ్గుల మండలం సండ్రలగడ్డ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ జైపాల్ నాయక్ తదితరులు ఎమ్మెల్యేను కలిసి గ్రామపంచాయతీ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు.
