తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్, డోయెన్స్ కాలనీ సమీపంలోని గంగా హెచ్పీసీఎల్ పెట్రోల్ పంప్ ప్రాంగణంలో మొదటి విక్రయ కేంద్రంగా హెచ్పీసీ ఎల్ నవ్య10కిలోల సిలిండర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవేష్ పురోహిత్, సీజీఎమ్, సౌత్ సెంట్రల్ జోన్ జీ ఎమ్ రిటైల్ అసిస్ సింగ్,డీ జీ ఎమ్ ఎల్ పీజీ. అంజుమ్ గిలానీ, తదితర హెచ్పీసీఎల్ అధికారులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు హాజరైనారు . ఈ సందర్బంగ వారు మాట్లాడుతు, గ్యాస్‌తో సహా సిలిండర్ ధర రూ.4,947 నాలుగువేల తొమ్మిదివందల నలభైఏడు రూపాయలు అని ,ఈ ఆగస్టు నెల రీఫిల్ ధర రూ.1,660. ఒక వెయ్యి ఆరువందల అరవై రూపాయలు అని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ఈ సిలిండర్లను రూపొందించడం జరిగిందని, సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత 90నిమిషాలలో డెలివరీ అవుతుందని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లీగల సాత్విక్ రెడ్డి, కలకోటి వెంకన్న, రోహిత్, రవి , శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
