తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సతీమణి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్ పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు శ్రీమతి రాగం సుజాత యాదవ్ అకాల మృతి పట్ల పాపి రెడ్డి కాలనీ లోని సీనియర్ మహిళా సంఘ సేవకురాలైన కే.కనకలక్ష్మి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె తుది శ్వాస విడిచారు. ఈ సందర్భంగా కే.కనకలక్ష్మి మాట్లాడుతూ, శ్రీమతి రాగం సుజాత యాదవ్ సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్‌గా, సామాజిక సేవకురాలిగా సమాజానికి అందించిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఆమె మరణం శేరిలింగంపల్లి నియోజకవర్గానికి, అలాగే వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని వేడుకొన్నారు.
