తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని సీనియర్ బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఉమామహేశ్వరి రెడ్డి అన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయుల గురించి చిన్నారులకు అవగాహన కల్పించాలని సూచించారు. హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా కిడ్జీ చిన్న పిల్లల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి నలందనగర్, ఉప్పరపల్లి వీధుల్లో తిరంగా యాత్ర నిర్వహించారు. ‘భారతమాతకు జై’ అంటూ నినాదాలు చేస్తూ జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సరోజ, లక్ష్మి, శారద, స్పందన ఈ సందర్భంగా ఉమామహేశ్వరి రెడ్డి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి దేశ పౌరులని, వారిలో దేశభక్తి, జాతీయ సమైక్యతా భావాలను చిన్ననాటి నుంచే పెంపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సరోజ, లక్ష్మి, శారద, స్పందన, నాగదుర్గ, పద్మ, లావణ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.