తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాముని చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి, చెరువును పరిశుభ్రంగా మార్చేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి చెరువు పరిశుభ్రత పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. చెరువుల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడం వల్ల నీటి నాణ్యత దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందని తెలిపారు. గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించి చెరువులను సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఉపయోగపడే చెరువులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, పాల్గొన్నారు.
