తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కర్తల్ పట్టణం మీదుగా వెళ్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ కారణంగా నష్టపోయిన రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని కోరుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి రైతులు, కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. హైటెన్షన్ లైన్ ఏర్పాటుతో పంటలు, భూములు నష్టపోయిన రైతుల వివరాలను ఎమ్మెల్యేకు వివరించి, బాధిత రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిక్షపతి, ఉప సర్పంచ్ యాదగిరిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, నరసింహ తదితరులు ఎమ్మెల్యేను కలిశారు. రైతుల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
