తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శంషాబాద్ మండలంలో సీపీఐ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకుడు, సీపీఐ శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నర్రగిరి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. స్వాతంత్ర్య ఫలాలు ప్రతి పేదవాడికి అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.దేశంలో పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, కార్మికుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొంటూ.. ప్రజల హక్కులను కాపాడేందుకు సీపీఐ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఓసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గిలక రాజు, ఎడ్ల శీను, పద్మ, శీను, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
