తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : జంగమ్మెట్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వాహక కార్యదర్శి పార్వతాల రాజేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్వతాల రాజేందర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, జాతీయ సమైక్యతా విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి. సదామణి శంకర్, సాయి ఉదయ్, సాయి యాదవ్, దీపు తదితరులు పాల్గొన్నారు.