తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ విలేజ్, మసీద్ బండలోని శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయంలో ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ నేతృత్వంలో పండిత శ్రేష్టులతో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలలో శనివారం వేకువఝామునే దేవాలయానికి భక్తజనులు విచ్చేసి స్వామివారి పూజలలో పాల్గొని, దేవాలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో స్వామి దర్శనార్ధమై విచ్చేసిన భక్త జనులందరికీ ఏర్పాటుచేసిన తీర్థప్రసాదాలను స్వీకరించి శ్రీ వీరాంజనేయ స్వామి కృపకు పాత్రులై ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తజనులు మాట్లాడుతు, శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ స్వయంభు వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని అత్యంత వైభవంగ తీర్చిదిద్ది, భక్తజనులకు శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకునే భాగ్యాన్ని కలుగజేస్తున్నందుకు ఆలయ ధర్మకర్త మారబోయిన సందీప్ యాదవ్ కు హృదయపూర్వకంగా కృతజ్ఞతా భావంతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేస్తున్నామని అన్నారు.