తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మండల పరిషత్ రాజేంద్రనగర్ పరిధిలోని నేతాజీనగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు బి. ప్రమీల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాలనీ పెద్దలు సుధాకర్ గౌడ్, కృష్ణ గౌడ్, దత్త, డాక్టర్ కృష్ణ, రామారావు, మాధవరెడ్డి, యాదిరెడ్డి, ఉపేందర్, కుమార్ యాదవ్, జైపాల్, కొంపల్లి జగదీష్, గోంత్యాల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయు రాలు ప్రమీల మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యత, సమానత్వం వంటి విలువలను అలవర్చుకొని దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.విద్యార్థులు నిర్వహించిన ఉపన్యాసాలు, దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు కాలనీవాసులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో పాల్గొని అలరించారు. వారి ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రతిభను ముఖ్య అతిథులు, కాలనీవాసులు అభినందించారు.ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు జి. భూమత, మహేశ్వర్, యాదమ్మ, లక్ష్మి, ప్రీ-ప్రైమరీ బోధకులు అశ్విని, సంగీత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
