తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రుద్రా కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌జీఐఏ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రుద్రా కాలనీలోనూ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా రుద్రా కాలనీ అధ్యక్షుడు కేవై ప్రణయ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు, ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధులు కలలు కన్న సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, లౌకికత, విద్య, ఉపాధి హక్కులతో కూడిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
దేశంలోని విద్యార్థులు, యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పేద, బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయ పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ యాదవ్, శివసాయి, బాలు, ప్రేమ్ కుమార్, నాని, సోహైల్, కిషోర్, కృష్ణ, జూన్, సుధీర్ బాబు, సన్నీ, బ్రహ్మయ్య, జాషువా పాల్, టీంకుల్, ఇజ్రాయిల్, విశాల్, ప్రజమాన్, అనిల్, బంటీ, తరుణ్, భావేష్, రుద్రాక్ష, నిఖిల్, లక్కీ, సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.
