తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ కాటేధాన్, మైలర్ దేవ్ పల్లి డివిజన్ల పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్, కాటేధాన్, శ్రీరాంనగర్, లక్ష్మిగూడ, ఆనంద్ నగర్ ప్రాంతాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జీహెచ్‌ఎంసీ మాజీ ఉమ్మడి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని దేశభక్తి భావాన్ని చాటుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని తోకల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆడీకే జనార్ధన్, పాండు యాదవ్, బుచ్చిరెడ్డి, తలారి చిన్న, ఎల్‌వీ రెడ్డి, నర్సిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమేష్, శ్రీకాంత్ రెడ్డి, ఎండీ మజార్, అంజమ్మ, లక్ష్మీ, రాజేష్, చెన్నమ్మ, గోపాల్ నాయక్, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.