తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బీసీ హక్కుల సాధన సమితి రాజేంద్రనగర్ నియోజకవర్గ సమావేశం శనివారం రాజేంద్రనగర్ మండల కార్యాలయంలోని ఏఆర్ దేవరాజ్ భవన్‌లో బీసీ హక్కుల సాధన సమితి రాజేంద్రనగర్ మండల ఇన్‌చార్జి జే. ఆనంద్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీసీ హక్కుల సాధన సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్నాటి యాదయ్య, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సీపీఐ మాజీ కార్యదర్శి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర నియంత్రణ కమిషన్ సభ్యుడు పుస్తకాల నర్సింగ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్నాటి యాదయ్య, పుస్తకాల నర్సింగ్‌రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి వార్షిక బడ్జెట్‌లో 50 శాతం నిధులను బీసీల అభివృద్ధికి కేటాయిం చాలని కోరారు. పార్లమెంట్, శాసనసభల్లో కూడా బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. జనాభాలో తక్కువ శాతం ఉన్న వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల బీసీలకు తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 29వ జీవోను రద్దు చేయాలని, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు 50 శాతం ఉపకోటా కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మూడు మండలాలకు బీసీ హక్కుల సాధన సమితి నూతన కమిటీలను ఎన్నుకున్నారు. రాజేంద్రనగర్ మండల కమిటీ: గౌరవ అధ్యక్షుడిగా జే. ఆనంద్ గౌడ్, అధ్యక్షుడిగా జే. సదానంద గౌడ్, ఉపాధ్యక్షుడిగా గుజ్జరి శ్రీరాములు, ప్రధాన కార్యదర్శిగా కె. మనోజ్, సహాయ కార్యదర్శిగా కె. మౌనికతో పాటు 15 మందితో కమిటీని ఎన్నుకున్నారు. గండిపేట మండల కమిటీ: అధ్యక్షుడిగా ఆర్. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎం. గోపాల్‌తో పాటు 11 మందితో కమిటీని ఎన్నుకున్నారు.శంషాబాద్ మండల కమిటీ: అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కావలి మల్లేష్‌తో పాటు 11 మందితో కమిటీని ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో సీపీఐ శంషాబాద్ కార్యదర్శి నరగిరి, గండిపేట కార్యదర్శి మల్లేష్, రాజేంద్రనగర్ మండల సహాయ కార్యదర్శి జే. విజయ్ ఆనంద్ గౌడ్, భారత జాతీయ మహిళా సమాఖ్య రంగారెడ్డి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షురాలు, రాజేంద్రనగర్ మండల ప్రధాన కార్యదర్శి కన్యగారి లక్ష్మి, భారత జాతీయ మహిళా సమాఖ్య రాజేంద్రనగర్ మండల అధ్యక్షురాలు మునేశ్వరి, కార్యాలయ కార్యదర్శి జి. సత్యం, గంగారం, శాలిని, జ్యోతి, మధు తదితరులు పాల్గొన్నారు.