తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదడాన్  డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత నాగమణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులతో కలిసి పాఠశాలలో, శ్రీ విద్యానికేతన్ ఉన్నత పాఠశాల బాబుల్ రెడ్డి నగర్ బొడ్రాయి వద్ద, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కాటేదాన్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ ఎస్. వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యతో పాటు మంచి విలువలు, నైతికత, క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ కీలక పాత్ర పోషిస్తుందని, క్రమశిక్షణతో పాటు పట్టుదల, కృషి ఉంటే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు.

విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్య అతిథులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

శ్రీ విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో ఎస్‌ఎస్‌సీలో పాఠశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఎస్. వెంకటేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.విద్యార్థుల దేశభక్తి, క్రమశిక్షణ, సాంస్కృతిక ప్రతిభను పలువురు అభినందించారు. ఈ

కార్యక్రమంలో కాటేదాన్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు ఉప్పల్ శ్రీను, సింహాద్రి, కార్తీక్, అశోక్ కుమార్, సునీల్, రామకృష్ణ, రాజు, ప్రవీణ్, సన్నీ, గురుస్వామి, రామస్వామి, శంకర్, శ్రీ విద్యానికేతన్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ బోయ లక్ష్మణ్, నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.