కామారెడ్డి జిల్లా తెలంగాణ ఎక్స్ ప్రెస్(ఆగష్టు 15): జిల్లాలోని బిక్నూర్ మండలం అంతంపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.ఆ తర్వాత విద్యార్థులు వారిదైన శైలిలో ఆట,పాటలు,ఉపన్యాసాలతో కనువిందు గ్రామస్తులను అందరిని ఆకట్టుకున్నారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ…దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన తర్వాత 1947 లో భారతదేశం స్వేచ్ఛా దేశంగా అవతరించిన చారిత్రాత్మకతకు ఆగష్టు 15 గుర్తుగా నిలుస్తుంది . స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను గౌరవిస్తూ ఈ రోజును స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం.

బ్రిటిష్ పాలన ముగింపు తరువాత భారత దేశానికి సార్వభౌమాధికారము ఏర్పాటు అయింది.మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్,భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకుల నేతృత్వంలో సాగిన ఈ ఉద్యమం, అహింసాత్మక ప్రతిఘటన మరియు శాసనోల్లంఘనపై ఎక్కువగా ఆధారపడింది అని ఆయన మాట్లాడారు.

అలాగే గతంలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చాలా బాధాకరంగా ఉండేది అన్నారు. పాఠశాల మూసి వేసే పరిస్థితి వచ్చినప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో పాటు గ్రామ పెద్దల సహాయంతో పాఠశాలకు పునర్వైభవం తేవడానికి నా కృషి చేశాను అన్నారు. మేము అనుకున్న విధంగానే గతంలో కంటే ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరిగింది,పై అధికారుల నుండి కూడా మాకు ప్రత్యేక అభినందనలు రావడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది,మరియు ఈ పాఠశాలలో విద్య గతంలో నాటికంటే ఇప్పుడు మెరుగుపడింది అని తల్లిదండ్రుల ప్రశంసలు వచ్చినందుకు ఆనందంగా ఉంది అన్నారు, భవిష్యత్తులో కూడా గ్రామ ప్రజల సహకారం ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

గతంలో పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు,గుంతలు,చెత్త,నిర్లక్ష్యంగా ఉండేది,ప్రహరీ గోడ లేక విద్యార్థులకు ఇబ్బందిగా మారింది.కానీ ప్రస్తుతం పాఠశాలలోని పర్యావరణం చాలా పరిశుభ్రంగా మారింది.దీనికి కారణమైన గ్రామా యువతకు,గ్రామ సర్పంచ్ వలకొండ మంజుల సంజీవరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోల్కొండ శ్రీనివాస్ రెడ్డి,వార్డు మెంబర్లు,విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ ప్రజలు,యువకులు,గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వలకొండ గంగారెడ్డి,సభ్యులు పాల్గొన్నారు.