తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దుర్గా నగర్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడు జే. ఆనంద్ గౌడ్, సీపీఐ రాజేంద్రనగర్ మండలం సహాయ కార్యదర్శి జే. విజయానందం గౌడ్, బీసీ హక్కుల సాధన సమితి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు జే. సదానందం గౌడ్, గుజ్జరి శ్రీరాములు, కె. మధు, జే. తేజు గౌడ్, జే. రిథ్విక్ గౌడ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
