తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి, నల్లగండ్లలోని వర్టెక్స్ కింగ్స్ పార్క్ విల్లాస్ 224నెం.లో తెలంగాణ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితమైన కీ.శే. రాగం సుజాత యాదవ్ దశదినకర్మ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ దశదినకర్మ కార్యక్రమానికి పిఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ , మాజీ ఏంపి,బీసీ వెల్ఫేర్, డెవలప్మెంట్ అడ్వైసర్ వి. హన్మంత్ రావు , మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి , మాజీ ఏంపి గడ్డం రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ , టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి బీజెపి కంటస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ , వర్టెక్స్ వర్మ , చందానగర్ సీఐ శ్రీధర్ , రాష్ట్ర నలుమూలల నుండి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, గౌరవ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, సామాజిక సంఘాల ప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కీ.శే. రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం, కుటుంబ సభ్యులైన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , కుమారులు రాగం అనిరుధ్ యాదవ్, రాగం అభిషేక్ యాదవ్ , కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాగం సుజాత యాదవ్ మహిళా సాధికారత కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని, వారు లేని లోటు తీరనిదని పలువురు నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు. అనంతరం, విచ్చేసిన అతిథులు ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజనం స్వీకరించారు.