తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నల్లగండ్ల డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామం, తండా, ఎన్టీఆర్ నగర్,తాజ్ నగర్, కేశవ్ నగర్, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాం నగర్, రాయదుర్గం గ్రామం,నానక్ రామ్ గూడ,ఖాజాగూడ, హైటెక్ సిటీ డివిజన్ పరిధిలోని మాదాపూర్ గ్రామం, ఇజ్జత్ నగర్ డివిజన్ భిక్షపతి నగర్, హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పెట్ గ్రామంలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాల్లో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు స్థానిక నాయకులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ గౌస్, డివిజన్ అధ్యక్షులు భరత్ గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు అభిషేక్ గౌడ్, సూరారం శేఖర్ రెడ్డి, పల్లపు సురేందర్, రోహిత్ గౌడ్, రాజు నాయక్, వెంకటేష్ నాయక్, వెంకటేష్ గౌడ్, గోపాల్ ముదిరాజ్, కనకమామిడి నరేందర్ గౌడ్, ఠాకూర్, మహేష్ యాదవ్, శ్రావణ యాదవ్, హనుమంతు, అంజి,వెంకటేష్, శ్రీనివాస్, నర్సింహ రాజు, బాబా, జావేద్, గోవింద్, శ్రీమతి సుస్మిత, దత్తు, కోటేశ్వర రావు, సీతారామ్, కృష్ణ రావు, పార్వతి,అనిల్, నవీన్, కార్తీక్,సుధీర్, ప్రసాద్, సందీప్, అమన్, సంజీవ్ రెడ్డి, జితేందర్ యాదవ్, వెంకటేష్ ముదిరాజ్, బల్లింగ్ మురళి గౌడ్, దేవేందర్ ముదిరాజ్, పాండు ముదిరాజ్, సుధాకర్, భాస్కర్, శ్రీను, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
