తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కాటేదాన్, మైలార్దేవ్‌పల్లి డివిజన్ల మీదుగా బాలాపూర్ గణనాథుడిని దర్శించుకునేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావుకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్, గుమ్మడి కుమార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి రామారావుకు ఘన స్వాగతం పలికారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి సమక్షంలో కార్యకర్తలు, అభిమానులు కరతాళ ధ్వనులతో రామారావును ఆహ్వానించారు. పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సన్మానించారు. రామారావు నాయకులు, కార్యకర్తలకు కరచాలనం చేస్తూ అభివాదం చేశారు.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ‘ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి’ అంటూ నినాదాలు చేయడంతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. రామారావు రాకతో కాటేదాన్, మైలార్దేవ్‌పల్లి ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా ఎస్. వెంకటేష్ మాట్లాడుతూ రామారావు రాక ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా బీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు రమేష్ ముదిరాజ్, ముకిత్ చందా, ధర్మారెడ్డి, లక్ష్మీరాజ్, మైసిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శివ ముదిరాజ్, శేఖర్, గంజి రాజు, అనిల్, సంతు గౌడ్, రాజేష్ యాదవ్, రాఘవేందర్ యాదవ్, కార్మిక విభాగం శ్రీను, అప్ప, ప్రవీణ్, యాదయ్య, కొంపల్లి జగదీష్, సునీల్, ప్రసన్న, పుష్ప, వెంకటరమణ, మల్లేష్ నేత, భాస్కర్, చిరంజీవి, సురేష్, చిన్న, శ్రీనాథ్, మహేష్, కాంతు తదితర బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు రామారావుకు ఘన స్వాగతం పలికారు.
