తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గురువారం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మహాగణపతుల విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ 9వ ఫేజ్, కేపీహెచ్‌బీ 4వ ఫేజ్, కేపీహెచ్‌బీ వెంచర్- 2, గాయత్రి నగర్ డివిజన్‌లోని వివేకానంద కాలనీ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన వినాయక మహాగణపతులను దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం, ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రజలందరిలో భక్తి, ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా బండి రమేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.