తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఐక్యతే బలం.. సేవే స్ఫూర్తి అనే సందేశంతో కాటేదాన్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సనాయి వాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని ఘనంగా ఊరేగించారు.

పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నీటి కొలనులో వినాయక విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలంతా ఐక్యంగా ఉంటే సమాజం మరింత బలోపేతమవుతుందని, సేవా భావంతో ముందుకు సాగితే సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించగలరని తెలిపారు.

వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించా రు.నిమజ్జన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి, ఐక్యత, సేవా స్ఫూర్తిని చాటారు.