తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరంగాపురం, టేకు నరసింహ నగర్ కాలనీలలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని వినాయక మండపంల వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీల వారితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలుచేసిన మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, మియాపూర్ డివిజన్ ప్రజలందరికీ వినాయక చవితి పర్వదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని, మీ జీవితంలోని సకల విఘ్నాలను తొలగించి, విజయాలను అందించాలని, సమస్త శుభాలు, సంతోషాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి అనుగ్రహం మీపై ,మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ శ్రీ వినాయకుని ఆశీస్సులతో అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ వినాయక చవితి పర్వదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని, మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూనే పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉన్నతమైన లక్ష్యంతో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మట్టి వినాయకులను పూజించాలని, భక్తితో పాటు ప్రకృతి పట్ల బాధ్యతను కలిగి ఉండడం మనందరి ధర్మం. ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించి, పర్యావరణహితమైన పండుగను జరుపుకోవాలని మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తెలియచేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా PAC ఛైర్మెన్ ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు అన్ని రకాల ఏర్పాట్లుచేయడం జరిగినదని, ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకునేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేయడం జరిగినదని, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఓక్కరి సామాజిక భాద్యత అని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మట్టి వినాయకులను పూజించాలని, పాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాల వలన చెరువులు కలుషితం అవుతాయని, చెరువులను కలుషితం కాకుండా చూడాలని, చెరువులను సంరక్షించుకోవాలని , చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీకాంత్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు