తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం: మస్జిద్ బండ, సుదర్శన్ కాలనీ , రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డీ కాలనీ ప్రాంతాలలో వినాయక చవితి పర్వదిన శుభ సందర్బంగ ఏర్పాటుచేసిన వినాయక మండపాలను మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు రాజుశెట్టి కురుమ సందర్శించి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్బంగ రాజుశెట్టి కురుమ మాట్లాడుతు, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకునే భాగ్యాన్ని కలుగజేసిన నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని వేడుకున్నారు.