తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో బాల గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణేశుని లడ్డూ వేలంపాట ఉత్సాహంగా సాగింది.

వేలంపాటలో గోదా నరేష్ యాదవ్ రూ.71 వేలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. అనంతరం నిర్వాహకులు నరేష్ యాదవ్‌ను సత్కరించి లడ్డూను అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులు, గోదా పాండు యాదవ్, గోదా రమేష్ యాదవ్, గోదా నరేష్ కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.