తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట ఘనంగా ముగిసింది. భక్తులు, ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ వేలంపాటలో అర్బన్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి అత్యధికంగా రూ. 39 లక్షలు పాడి లడ్డూను కైవసం చేసుకున్నారు. విఘ్ననాథుని నవరాత్రి ఉత్సవాలు భక్తి, విశ్వాసంతో పాటు సేవా స్ఫూర్తిని చాటేలా విజయవంతంగా కొనసాగడం ఆనందదాయకమని ఈ సందర్భంగా నిర్వాహకులు ఆకాంక్షించారు. ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట మరోసారి భక్తుల ఐక్యతకు, భక్తిభావానికి మరియు సేవా రంగానికి ప్రతీకగా నిలిచిందని వారు పేర్కొన్నారు.