తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం, హఫీజ్ పెట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్ జన్మదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి. జగదీశ్వర్ గౌడ్ తో కలిసి రుమాళ్ళ సుధాకర్, పద్మారావు, లక్ష్మణరావు లు నరేందర్ గౌడ్ ను శాలువాలతో సత్కరిస్తూ, హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రుమాళ్ళ సుధాకర్ మాట్లాడుతూ, నరేందర్ గౌడ్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఆ భగవంతుని ఆశీస్సులు కలిగి ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేసారు.
