తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: మియాపూర్: మియాపూర్ పరిధిలోని దత్త సాయి కాలనీ, నడిగడ్డ తండా, ఆరోబిందో కాలనీలలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం మరియు ఉత్సాహభరిత కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టిపిసిసి జనరల్ సెక్రటరీ వి. జగదీశ్వర్ గౌడ్, అలాగే మియాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యలమంచి ఉదయ్ కిరణ్ , వ్యవస్థాపకులు, చైర్మన్. యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్, ఆయా ఉత్సవ కమిటీలు మరియు సంఘాల ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారు శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం, సర్వశ్రేయస్సు కలగాలని శ్రీ వినాయక స్వామివారిని ప్రార్థించారు. దత్త సాయి కాలనీ దత్త సాయి కాలనీ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు వేడుకల్లో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రవి కృష్ణ, సురేష్, మారుతి, నాగేశ్వరావు తదితరులు అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించి ఆత్మీయంగా స్వాగతించారు. కార్యక్రమంలో విజయ భాస్కర్ రెడ్డి, మూర్తి, రవి, శంకర్, మధు, ప్రణీత్, వంశీ, ప్రవీణ్ తదితరులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువత, స్థానిక నివాసితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నడిగడ్డ తండా మయూరి నగర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో నడిగడ్డ తండా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి. ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని లక్ష్మణ్, శంకర్, శివ, సచిన్, సుమన్, దేవేందర్, సాయి కుమార్ మరియు వారి మిత్రబృందం సమన్వయంతో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో విజయ భాస్కర్ రెడ్డి, మూర్తి, శంకర్, మధు, వంశీ, ప్రణీత్, ప్రవీణ్, గురువులు తదితరులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువత, స్థానిక నివాసితులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆరోబిందో కాలనీ ఆరోబిందో కాలనీలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు వేడుకలు భక్తి, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆరోబిందో గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో లోకేష్, రమేష్, సురేష్ మరియు కమిటీ సభ్యులు అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో విజయ భాస్కర్ రెడ్డి, రవి గౌడ్, శంకర్, మూర్తి, మధు, వంశీ, ప్రణీత్, ప్రవీణ్ తదితరులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువత, స్థానిక నివాసితులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు ప్రాంతాల్లోనూ భక్తులు ఉత్సాహంగా పాల్గొని వినాయక స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరి జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు శ్రేయస్సు వెల్లివిరియాలని కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు ఆకాంక్షించారు.