తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : బాబుల్ రెడ్డి నగర్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణేశ్ లడ్డూ వేలంపాట భక్తుల ఉత్సాహంతో కోలాహలంగా సాగింది.ఈ వేలంపాటలో బీఆర్ఎన్ కా మహారాజ్ 101 కిలోల భారీ గణేశ్ లడ్డూను దుర్గ టిఫిన్ సెంటర్ అధినేత రవి కిషోర్ రూ.5 లక్షలకు దక్కించుకున్నారు. అలాగే 21 కిలోల గణేశ్ లడ్డూను సోమ సందీప్ రూ.1 లక్షకు దక్కించుకోవడం విశేషం. భక్తులు పోటాపోటీగా పాల్గొనడంతో వేలంపాట ప్రాంతమంతా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ… గణేశ్ లడ్డూ వేలం భక్తి, ఐక్యతతో పాటు సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు.
